Declare cow national animal, protecting it should be a fundamental right of Hindus says Allahabad HC
#CowNationalAnimal
#AllahabadHC
#Hindusfundamentalright
#cowprotection
#BJP
#PMModi

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని చాలా కాలం నుంచి దేశ వ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్రానికి సూచించింది. అంతేగాక, గో సంరక్షణను హిందువుల ప్రాథమిక హక్కుగా చేయాలని స్పష్టం చేసింది. ఆవులకు జాతీయ జంతువు హోదా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు తీసుకురావాలని కోర్టు పేర్కొంది. దేశంలో ఆవులు సంతోషంగా ఉన్నప్పుడే దేశం కూడా సంతోషంగా ఉంటుందని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. భారతీయ సంస్కృతిలో ఆవు ఎంతో ముఖ్యమైనదని అభిప్రాయపడింది. ఆవుకు సంబంధించి పార్లమెంటు చేసిన చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది.